India Can Reclaim No1 position in ODI Rankings | Oneindia Telugu

2017-12-09 45

India are already the top-ranked in Test cricket and are on 120 points in the ODI rankings, only one point behind South Africa.

ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో కూడా 120 పాయింట్లు ఉన్నప్పటికీ కొద్దిపాటి వ్యత్యాసం కారణంగా దక్షిణాఫ్రికానే నంబర్‌వన్‌గా ఉంది. ఆదివారం నుంచి శ్రీలంకతో జ‌రిగే మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
టీమిండియాకు ఇదొక అద్భుత అవకాశం. పర్యాటక జట్టు లంకను మరోసారి క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకోగలదు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. మొదటి వన్డే ధర్మశాలలో రేపు ఉదయం 11.30గంటలకు ప్రారంభంకానుంది. ధర్మశాల వన్డేలో భారత్‌ విజయం సాధిస్తే 121 పాయింట్లతో భారత్‌ మొదటిస్థానానికి వెళ్తుంది.